సినీపరిశ్రమలో హారర్ మూవీస్, వెబ్ సిరీస్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వణుకుపుట్టించే చిత్రాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉన్న లు ప్రతి వారం ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ ఈ లు చూడాలంటే కచ్చితంగా సబ్ స్క్రిప్షన్ ఉండాల్సిందే. కానీ యూట్యూబ్ లో మాత్రం ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండానే లు చూడొచ్చు. ముఖ్యంగా హారర్ సినీప్రియులకు యూట్యూబ్ లో లెక్కలేనన్ని మూవీస్ అందుబాటులో ఉన్నాయి. నిజానికి యూట్యూబ్ లో రిలీజ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, హారర్ చిత్రాల గురించి జనాలకు అంతగా తెలియదు. అందుకే అసలు ఎలాంటి చిత్రాలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా. కాలింగ్ బెల్.. కొత్తగా పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చిన ఓ జంటకు ఓ దెయ్యం కారణంగా విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. దీంతో ఆ జంట ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత మరికొందరు ఫ్రెండ్స్ ఆ ఇంట్లోకి వస్తారు. అప్పుడు వాళ్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. చివరకు ఆ దెయ్యం గురించి ఏం తెలుసుకున్నారు అనేది ఈ చిత్రం. ఊహించని మలుపులు, హారర్ సీన్లతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది ఈ చిత్రం. డిమోంటీ కాలనీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన డిమోంటీ కాలనీ. ఓ పాత భవనంలోకి వెళ్లిన నలుగురు స్నేహితుల మధ్య ఏం జరిగింది. వారికి ఎదురైన పరిస్థితులను ఎలా ఫేస్ చేశారు అనేది కథ. ఊహించని ట్విస్టులతో అనుక్షణం ఉత్కంఠను కలిగిస్తుంది ఈ . ఎలా 7.. హిందీలో విడుదలైన ఈ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పటికీ మిలియన్ వ్యూస్ రాబట్టింది. దెయ్యంతో ఓ కొత్త జంట ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాక్షసి.. కాలింగ్ బెల్ అనే హారర్ మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఆధ్యంతం ఊహించని ట్విస్టులతో సాగుతుంది ఈ . హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.