స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న త్రిష.. కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన పెంపుడు కుక్క జోర్రో మరణించడం జీర్ణించు కోలేకపోవడంతోనే సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో త్రిష క్లారిటీ ఇస్తే గాని తెలియదు.ఈ పోస్ట్ చూసి, చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. అసలు త్రిషకి పెళ్లే కాలేదు, అలాంటిది కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? త్రిష, ఎవరినైనా దత్తత తీసుకుందా? అంటూ గూగుల్‌లో వెతికారు. కాసేపటికి ఈ సస్పెన్స్‌ని బ్రేక్ చేస్తూ, జొరో ఫోటోలను షేర్ చేసింది త్రిష జొరో ఎవరో కాదు, త్రిష ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న ఆమె పెంపుడు కుక్క. ఈ విషయం తెలిసి.. ‘పెంపుడు కుక్కకా.. నా కొడుకు చనిపోయాడు’ అంటూ అంత రచ్చ చేసింది అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో త్రిష అంతగా ఫీలవుతుందంటే తన పెంపుడు కుక్కతో విడదీయలేని అనుబంధాన్ని పెంచుకుందంటూ కామెంట్లు చేస్తున్నారు..