ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీకి రజాకార్ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 08, 2025, 02:01 PM

తెలంగాణ చరిత్రపై చెరిగిపోని ఓ నెత్తురు మరక 'రజాకార్'. అప్పటి రజాకారులు తెలంగాణలోని హిందువులపై సాగించిన మారణకాండను ఈ నేల ఇంకా మరిచిపోలేదు. అలాంటి ఒక నేపథ్యాన్ని తీసుకుని తెరకెక్కిన సినిమానే 'రజాకార్'. క్రితం ఏడాది మార్చి 15వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అయితే అనేక కారణాల వలన ఈ సినిమాకి ఆశించిన స్థాయి ఆదరణ లభించలేదు. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై అడుగుపెడుతుందా అని చాలా కాలంగా చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే థియేటర్లకు రావడానికే అనేక అవాంతరాలను దాటవలసి వచ్చిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి కూడా అలాంటి పరిస్థితినే ఎదురైంది. ఆటంకాలను దాటుకుని, ఈ నెల 24వ తేదీన ఆహా ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెడుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు కూడా. ఆనాటి అమానుష శక్తిగా చెప్పుకునే 'రజాకార్' సాగించిన అరాచకాన్ని సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించిన కంటెంట్ ఇది. నారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. ఇంద్రజ .. అనసూయ .. బాబీ సింహా .. రాజ్ అర్జున్ ప్రధానమైన పాత్రలను పోషించారు. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa