ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజీఎఫ్‌ తరువాత మరోసారి మాస్‌ లుక్‌లో యష్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 08, 2025, 02:03 PM

కేజీఎఫ్‌, కేజీఎఫ్‌-2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న కన్నడ కథానాయకుడు యష్‌. 'కేజీఎఫ్‌'లో ఆయన మాస్‌ లుక్‌కు, మాస్‌ అవతార్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కేజీఎఫ్‌-2 తరువాత మరో సినిమా అంగీకరించడానికి చాలా సమయం తీసుకున్నారు యష్‌. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'టాక్సిక్‌'. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వంలో మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ నిర్మిస్తున్నారు. కాగా నేడు జనవరి 8న హీరో యష్‌ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన లుక్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్ గ్రోనప్స్‌ నుంచి బర్త్‌డే పీక్‌ అంటూ యష్‌ బర్త్‌డే ట్రీట్‌ను వదిలారు నిర్మాతలు. గ్లింప్స్‌ చూస్తుంటే బోల్డ్‌ కంటెంట్‌తో హాట్‌గా ఉంది. చిత్రం ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండబోతుందని, కొత్తదనం కోసం తపించే యష్‌ ఈ చిత్రంలో ఎంతో డిఫరెంట్‌గా, మోర్‌ మాసివ్‌గా కనిపించబోతున్నాడని అంటోంది చిత్ర యూనిట్‌. భారీ ఖర్చుతో, ప్రముఖ తారాగణంతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ప్రేక్షకులు ఎన్నో షాకింగ్‌ అంశాలను చూస్తారని, వారికి సరికొత్త అనుభూతిని పంచే చిత్రంగా ఇది ఉండబోతుందని దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌ చెబుతున్నారు 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa