ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత టాటూ... భర్త కోసం ప్రైవేట్ ప్లేస్‌లో

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 09, 2019, 02:19 PM

సమంత చాలా రొమాంటిక్. ఆన్ స్క్రీన్‌పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా రొమాన్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. టాలీవుడ్ రొమాంటిక్ జోడీగా సమంత, నాగ చైతన్యలకు ఉన్న క్రేజే వేరు. ‘ఏ మాయ చేశావే’ అంటూ సమంత ప్రేమలో పడ్డ నాగ చైతన్య... ఆమెతో ప్రేమ.. సహజీవనం.. పెళ్లి ఇలా ప్రతి రిలేషన్‌ను ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు. నాగ చైతన్యకు సమంత అంటే ఎంత ప్రేమో.. సమంతకు చైతూ అంటే అంతకు మించి. సందర్భం వచ్చిన ప్రతిసారి భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచే సమంత.. తాజాగా ‘నా భర్త చైతూనే నా ప్రపంచం’ అంటూ షాకింగ్ ప్రైవేట్ ఫొటోను విడుదల చేసింది


సమంత ఇప్పటి వరకూ చూపించిన సీక్రెట్ టాటూను ఈ సందర్భంగా రివీల్ చేసింది. ఇందులో సమంత ఎద కింది భాగంలో టాటూ ఉండగా.. అందులో తన భర్త పేరు ఉందని చెప్పింది సమంత. ‘ఇప్పటి వరకూ రహస్యంగా దాచిన టాటూని చూపిస్తున్నారు.. చైతూతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను.. అతనే నా ప్రపంచం’ అంటూ సీక్రెట్ ప్లేస్‌లో వేసుకున్న టాటాను బహిర్గతం చేసింది సమంత. 


అయితే సమంత షేర్ చేసిన ఈ సీక్రెట్ టాటూ వైరల్ అవుతోంది. బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ కపుల్ అని కొందరు అంటుంటే.. భర్త కోసం ప్రైవేట్ ప్లేస్‌లో వేసుకున్న ఆ టాటూని ఇలా పబ్లిక్‌గా చూపించేస్తావా? అక్కినేని కోడలా.. అన్నీ చూపించేస్తే ఎట్టా.. కొన్ని చైతన్య కోసం దాచుకోవాలిగా అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా గతంలో కూడా సమంత, చైతూలు టాటూ విషయంలో హాట్ టాపిక్ అయ్యారు. పెళ్లికి ముందు ఇద్దరి చేతిపై ఒకే రకమైన టాటూ వేయించుకుని మీడియా కంట పడటంతో వీరు ప్రేమలో మునిగితేలుతున్నట్టు అప్పుడే కన్ఫామ్ అయ్యింది. ప్రస్తుతం సమంత ‘ఓ బేబీ’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీలో నాగచైతన్య కూడా గెస్ట్ రోల్ పోషించి సర్‌ప్రైజ్ చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa