బాలీవుడ్ ‘బడా ప్రొడక్షన్ హౌస్ నడియాడ్‌వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్’తో మూడు సినిమాల డీల్ కుదుర్చుకుందట నటి పూజాహెగ్డే. జుడ్వా, హౌస్‌ఫుల్, 2 స్టేట్స్, కిక్, భాఘీ చిత్రాలను నిర్మించిన సాజిద్ నడియాడ్‌వాలా ఈ మూడు చిత్రాలను భారీ లెవెల్లో నిర్మించనున్నారట. హౌస్‌ఫుల్ తర్వాత ఓ యాక్షన్ సినిమాను ఈ బ్యానర్‌లో పూజా హెగ్డే చేయబోతుందట . ఈ సినిమా కోసం రెండు నెలల భారీ డేట్స్ కూడా ఇచ్చిందట. ఇందులో ఎన్నో స్టంట్స్ ఉండబోతున్నాయని, వాటిని పూజా స్వయంగా చేయబోతుందని సమాచారం. యాంజెలీనా జోలీ నటించిన హాలీవుడ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ‘టూంబ్ రైడర్’ తరహాలో ఈ చిత్రకథ సాగనుందట. త్రీ మూవీస్ డీల్‌లో భాగంగా చేసిన సినిమాలు సక్సెస్ అయితే పూజ బాలీవుడ్‌లోనూ టాప్ లిస్ట్‌లో నిలబడుతుందనడంలో సందేహమే లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa