తమిళ హీరో విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ డైరెక్షన్లో తెరకెక్కించిన చిత్రం ధృవ నక్షత్రం. ఇందులో ఐశ్వర్య రాజేష్, రీతు వర్మ కథానాయికలుగా నటించారు. 7 ఏళ్ల క్రితమే ఈ మూవీ పూర్తయింది. కానీ వివిధ కారణాలతో ఇది వాయిదా పడుతూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మాట్లాడుతూ.. మొదట ఆ కథను పలువురు హీరోలకు చెబితే రిజెక్ట్ చేశారని, కానీ దానికి తను బాధపడలేదని, సూర్య నో చెప్పినప్పుడు ఎంతో బాధపడ్డానని తెలిపారు.