ఏపీలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, గుంటూరు- కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 3న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. 10వ తేదీ వరకూ వాటిని స్వీకరిస్తారు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 13న వాటి ఉప సంహరణకు తుది గడువని ఎన్నికల సంఘం తెలిపింది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించింది.