అపోలో హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సి. ప్రతాప్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అపోలో ఫౌండేషన్ తాజాగా ఏపీలోని పిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీలను ప్రారంభించింది. తద్వారా అపోలో ఫౌండేషన్ సమాజ సంక్షేమంలో ఒక గొప్ప అడుగు వేసింది.ఇక అపోలో ఫౌండేషన్ ఈ మోడల్ అంగన్‌వాడీల ద్వారా తల్లులు, నవజాత శిశువులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, చిన్ననాటి సంరక్షణలో మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. అపోలో హాస్పిటల్స్ చొరవ పట్ల పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పిఠాపురం అభివృద్ధిలో ముందుకెళ్తోందని వారు చెబుతున్నారు.