అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.`అసంఖ్యాక జీవితాలను మార్చి, నిజమైన స్ఫూర్తిగా నిలిచిన అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మీ 92వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, మరిన్ని విజయాలు సాధించేందుకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు' పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.