మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డా.చైతన్యరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. అలాగే పలువురు పోలీసు అధికారులపైనా కేసు ఫైల్ అయ్యింది. వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైల్లో చైతన్య తమను కలిసి మభ్యపెట్టినట్లు గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు దస్తగిరి. వివేకా కేసులో కేవలం బాధితుల ఒత్తిడి వల్ల అప్రూవర్‌గా మారి అపద్దాలు చెప్పాల్సి వచ్చిందని.. చెప్పమని చైతన్య ఒత్తిడి తెచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలా చేస్తే రూ.20 కోట్లు ఇస్తామని చైతన్య మభ్యపెట్టినట్లు అప్పట్లో దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా చైతన్య రెడ్డితో పాటు అప్పట్లో కేసు నమోదు చేయకుండా నిందితులకు సపోర్టు చేయమని తనపై ఒత్తిడి తెచ్చిన పోలీసు అధికారులపైనా దస్తగిరి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, సెంట్రల్ జైలు సూపరెండెంట్ ప్రకాష్‌లపై పులివెందుల పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు.
![]() |
![]() |