మిర్చి రైతుల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. పతనమవుతోన్న ధరలతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధాన వాణిజ్య పంట సాగుదారులను రక్షించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. బుధవారం చిలకలూరిపేటలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పొగాకు బోర్డు మాదిరిగా.. మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా మిర్చి రైతుల దశ మారేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన పేర్కొన్నారు.
వ్యాపారుల మాయాజాలం.. మార్కెట్ హెచ్చుతగ్గుల నియంత్రణఖు ప్రత్యేక చట్టాల ద్వారా చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మిర్చి ధరల పతనంపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. మిర్చి రైతుల్ని వెంటనే ఆదుకోవాలంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు.ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో మాత్రమే మిర్చి పంటను రైతులు పండిస్తున్నారు. అయితే మిర్చి పంటను విక్రయించే క్రమంలో రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారు. ఒక్కొక్కసారి మార్కెట్‌లో ధరల హెచ్చ తగ్గుల కారణంగా.. పండించిన పంటకు అయిన ఖర్చుకు తగినట్లుగా నగదు చేతికందడం లేదు. దీంతో మిరప వాణిజ్య పంటే అయినా.. దానికి తగినట్లుగా నగదు చేతికందడం లేదు. దాంతో మిర్చి రైతులు ఢీలా పడిపోతున్నారు. అలాంటి వేళ.. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుపై విధంగా స్పందించారు.