అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొబైల్ ఫోన్ల రికవరీ మేళా నిర్వహించారు. తొమ్మిది విడతలో రికవరీ చేసిన 503 మొబైల్‌లను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా లబ్ధిదారులకు అందజేశారు. సెల్ ఫోన్లను రికవరీ చేసిన ఐటీ కోర్స్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులను ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ... అనకాపల్లి జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో తొమ్మిది విడతల్లో 2,711 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు.
రికవరీ చేసిన సెల్ ఫోన్ల విలువ నాలుగు కోట్ల ఏడు లక్షలు ఉంటుందని ఆయన వెల్లడించారు.అయితే సెల్‌ఫోన్ పోగొట్టుకున్న అనేక మంది ఈ మేళాకు తరలివచ్చారు. పోయిందనుకున్న ఫోన్ తిరిగి తమ దరికి చేరడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి అప్పగించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వేల రూపాయలు పెట్టి కొన్న ఫోన్లు చోరీకి గురవడంతో ఎంతో బాధపడ్డామని.. తిరిగి ఫోన్ వస్తుందనే ఆశలు వదిలేసుకున్న సమయంలో ఫోన్ గురించి పోలీసులు ఇచ్చిన సమాచారంతో వెంటనే మొబైల్ రికవరీ మేళాకు వచ్చి ఫోన్లను తీసుకున్నామంటూ అక్కడి వచ్చిన లబ్దిదారులు చెబుతున్నారు.