దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తుగ్లక్ క్రెసెంట్ లోని వీవీఐపీ పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కించి, ఫలితాలు విడుదల చేయనున్నారు.