అక్రమ వలసదారులతో అమెరికా నుంచి నిన్న బయల్దేరిన US మిలిటరీ విమానం పంజాబ్లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. ఇందులో మొత్తం 104 మంది ఉన్నారు. వీరిలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులు ఉన్నారు. టెక్సాస్- మెక్సికో సరిహద్దుల్లో వీరిని గుర్తించారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియో బేస్ నుంచి బయల్దేరిన విమానం జర్మనీలో రీఫ్యూయల్ చేసుకొని అమృత్‌సర్‌కు వచ్చింది.