ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక టాక్సిక్ వాతావరణం ఏర్పడింది. ప్రధానంగా సినిమా స్టార్లను అభిమానించే క్రమంలో అభిమానులు హద్దులు దాటి విచక్షణ రహితంగా బిహేవ్ చేస్తున్నారు. వీరిని కంట్రోల్ చేసి మంచి బాటలో నడిపించే పవర్ లేకుండా పోయింది. వాస్తవానికి వీరు ఎవరి మాట వినరు అనుకోండి. కానీ.. వీళ్లు అభిమానించే స్టార్స్ మాటలు మాత్రం తప్పకుండ వింటారు. మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు 'మేము మేము బాగానే ఉంటాం, మీరే బాగుండాలి' అంటూ కొన్ని వేదికలపై హితబోధ చేసిన అది తాత్కాలికమే అయ్యింది. తాజాగా మరో స్టార్ హీరో ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్‌లో తమిళ్ స్టార్ హీరో అజిత్ పాల్గొని విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విజయానంతరం ఆయన ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. "లాంగ్ లివ్ అజిత్, లాంగ్ లివ్ విజయ్ అంటూ మా గురించి ప్రార్థించకుండా ముందు ఎవరికి వారు వాళ్ళ సొంత జీవితాల గురించి ఆలోచించుకుంటే అందరూ బాగుంటారు. నేను సంతోషంగా ఉన్నాను. నాలాగే అభిమానులు కూడా బాగుండాలని కోరుకుంటా. జీవితం చాలా చిన్నది మన మనవళ్లు మనవరాళ్లు గుర్తు పెట్టుకునేంత అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడేం చేస్తున్నామో దాని మీదే దృష్టి పెట్టాలని" అన్నారు.భారతీయ సినీ పరిశ్రమలో క్రమంగా టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ పెరిగిపోతున్న నేపథ్యంలో హీరోలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పనిసరి బాధ్యత. కానీ.. ఈ విషయంపై తారలు మాట్లాడటం చాలా అరుదు. ప్రత్యేకంగా ట్విట్టర్ లాంటి స్పేస్ లలో అభిమానులు.. హీరోల కోసం ఒక్కొక్కరు విచక్షణ కోల్పోయి తల్లి తండ్రులను, కుటుంబాలను ఇన్వాల్వ్ చేసుకున్న దారుణమైన భాషతో తిట్టుకోవడం చూస్తూనే ఉంటాం. అలాగే పేస్ మార్పింగ్స్, ఫేక్ పోస్టులు, కలెక్షన్స్, టికెట్స్ ఇలా చాలా విషయాలు అవసరం లేకున్నా యుద్దాలు చేయడం బాధాకరం.
![]() |
![]() |