కొన్నేళ్లుగా తెలుగు సినీ కళాకారులకు జాతీయ అవార్డుల విషయంలో అన్యాయం జరుగుతుందనే బలమైన వాదన వినిపిస్తుంది. దీనిపై ఇప్పటికే అనేక మంది ప్రముఖ నటులు, దర్శక నిర్మాతలు, విశ్లేషకులు బహిరంగంగానే తమ వాయిస్ ని వినిపించారు. తాజాగా సినీయర్ నటుడు నరేష్ ఇదే విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు.సీనియర్ నటుడు నరేష్.. తన తల్లి లెజెండరీ డైరెక్టర్ విజయనిర్మలకు పద్మ అవార్డు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన మీడియా ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. "46 మూవీస్ ను డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు విజయనిర్మల గారు. నేను ఢిల్లీ స్థాయిలో అమ్మకు పద్మ అవార్డు కోసం ప్రయత్నించాను. కానీ.. అమ్మకు పద్మ అవార్డు రాలేదు. ఆవిడ పద్మ అవార్డు కోసం కేసీఆర్ గారు కూడా రికమెండ్ చేశారు. నేను ఏ గవర్నమెంట్ ను విమర్శించడం లేదు. బీజేపీ వచ్చిన తరువాత నిజంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు ఇస్తున్నారు సంతోషంగా ఉంది. ఎంజీఆర్ గారు బ్రతికున్నప్పుడు పద్మ అవార్డు రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా రాలేదు. పోస్తమస్ గా అయినా పద్మ అవార్డు అమ్మకు ఇవ్వాలి. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఆ అర్హత కలిగిన వాళ్లు ఉన్నారు. మన వాళ్లకు పద్మ అవార్డు లు వచ్చేందుకు ఆమరణ నిరాహారదీక్ష చేసిన తప్పులేదు. మళ్లీ ఇప్పటి నుంచి అమ్మకు పద్మ అవార్డు రావడం కోసం ప్రయత్నిస్తాను" అన్నారు.