ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్‌ దేవరకొండ చిత్రానికి టైటిల్‌ ఖరారైనట్లే

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 07:58 AM

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి  దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్‌కు 12వ చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ  నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత ఆసక్తికర ట్వీట్‌ చేశారు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ సినిమా టైటిల్‌ సెలక్షన్‌పై కొన్నాళ్లగా చర్చ జరుగుతోంది. ఆ సస్పెన్స్‌కు నిర్మాత తెరదించారు. సినిమా టైటిల్‌ ఫిక్స్‌ అయిందని త్వరలో టెటిల్‌ లుక్‌ను విడుదల చేస్తామని తెలిపారు. "ఈ సినిమా టైటిల్‌ కోసం కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో అభిమానులు పెట్టే పోస్ట్‌లు,  గౌతమ్‌ని నేను పెట్టిన హింసతో ఓ టైటిల్‌ లాక్‌ చేశాము. అతి త్వరలోనే రివీల్‌ చేస్తాం’’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఈ సినిమాకు సామ్రాజ్యం, ద ఎంపైర్‌ అనే టైటిల్‌ అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు. మేలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa