12 సంవత్సరాల ఆలస్యం అయిన తరువాత కోలీవుడ్ నటుడు విశాల్ యొక్క తమిళ కామెడీ ఎంటర్టైనర్ 'మాధ గాధ రాజా' చివరకు పొంగల్ పండుగ సీజన్లో విడుదల అయ్యింది. సినిమా ప్రేమికులు మరియు వాణిజ్య వర్గాలను విస్మయంతో వదిలి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం జనవరి 31న అదే టైటిల్‌తో తెలుగులో విడుదల అయ్యింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమాలోని తుంబాక సాంగ్ ని ప్రముఖ నటుడు మరియు మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఈరోజు సాయంత్రం 5:04 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్ లో విశాల్ మరియు సదా స్క్రీన్ స్పేస్ ని పంచుకున్నారు. ఈ చిత్రంలో కమెడియన్ సంతానం, అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు సోనూసూద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జెమినీ ఫిలిం సర్క్యూట్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పిస్తోంది. ప్రముఖ నటుడు, స్వరకర్త విజయ్ ఆంటోని సౌండ్‌ట్రాక్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa