విక్కీ భగ్నానీ ఆయన ప్రియురాలు నిధి సిద్ధరాజ్ ల పెళ్ళి బారాత్ లో రకుల్ ప్రీత్ సింగ్ , జాక్కీ భగ్నానీ అద్భుతంగా కనిపించారు. సిల్వర్ టోన్డ్ బ్లింగీ షరారాలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికూతురును మించి మెరిసిపోయారు. అందరి చూపులను ఆమె ఆకర్శించారు.రకుల్ కంటే ఏమాత్రం తగ్గకుండా కనిపించాడు జాకీ భగ్నాని. వైట్ కుర్తా , బ్లాక్ పటియాలా ప్యాంటులో జాక్కీ భగ్నానీ హ్యాండ్సమ్ గా కనిపించారు. విక్కీ భగ్నానీ బారాత్ లో రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాక్కీ భగ్నానీతో కలిసి డ్యాన్స్ చేశారు. వారి ఫోటోలు , వీడియోలు వైరల్ అవుతున్నాయి.పెళ్లికూతురు నిధి సిద్ధరాజ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె గోల్డెన్ లెహెంగాలో చాలా అందంగా కనిపించింది.విక్కీ భగ్నానీ , నిధి సిద్ధరాజ్ లను అభినందించడానికి నటుడు ఇమ్రాన్ హష్మీ భార్య మరియు కొడుకుతో కలిసి వచ్చారుకమెడియన్ , నటుడు రజత్ రావెల్ కూడా విక్కీ భగ్నానీ వివాహానికి హాజరయ్యారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా పెళ్ళిలో సందడి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa