స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు, టాలీవుడ్ హీరో సాయి రామ్ శంకర్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. సాయి రామ్ శంకర్ మల్టీపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించి టీమ్ ఇటీవల ఓ కాంటెస్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సినిమా చూస్తూ.. ఇంటర్వెల్ టైమ్‌కి విలన్ ఎవరో చెబితే స్పాట్‌లో రూ. 10వేలు ఇస్తామని టీమ్ ప్రకటించిన ఛాలెంజ్‌తో.. సినిమాపై బాగానే క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌కి కంటిన్యూ అన్నట్లుగా చిత్ర హీరో సాయి రామ్ శంకర్ తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను మీడియాకు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa