ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతీకారం నేపథ్యంలో ‘అక్క’

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 04:03 PM

కీర్తి సురేశ్‌ త్వరలో ‘అక్క’గా రాబోతుంది. ఆమె, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ఇది. ధర్మరాజ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌ను అధికారికంగా ప్రకటిస్తూ.. టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఒక తిరుగుబాటుదారుడు పతనానికి కుట్ర పన్నాడు. పెర్నేరుకు చెందిన ఓ అమ్మాయి అక్కలపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. వేచి ఉండండి ‘అక్క’ త్వరలో వస్తోంది’’ అని పోస్ట్‌ చేశారు. ప్రతీకారం నేపథ్యంలో రూపొందుతున్న సిరీస్‌లో కీర్తి ఓ శక్తిమంతమైన పాత్రలో కనువిందు చేయనున్నట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa