బలగం సినిమా తర్వాత అందరి కన్ను టాలీవుడ్ దర్శకుడు వేణుపై పడిన విషయం తెలిసిందే. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో బలగం సినిమా రావడంతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.అయితే ఈ ప్రాజెక్ట్ అనంతరం వేణు ఎల్లమ్మ అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే 'ఎల్లమ్మ' అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఎవరు లీడ్ రోల్ చేయబోతున్నారు అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ఈ సినిమాలో నాని (Nani) లేదా నితిన్ (Nitiin) హీరోగా నటించబోతున్నట్లు సమాచారం.ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి చాలా రోజులు అయినప్పటికి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఇదిలావుంటే చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీకి సంబంధించి ఒక అప్‌డేట్‌ని వెల్లడించాడు దర్శకుడు వేణు. ఎల్లమ్మ ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్న త్వరలోనే అప్‌డేట్స్ వెల్లడిస్తాను అంటూ వేణు రాసుకోచ్చాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాను నిర్మించబోతున్న దిల్ రాజు ఫిబ్రవరిలో స్టార్ట్ అవ్వబోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వేణు కూడా మూవీపై స్పందించడంతో త్వరలోనే మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa