గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ థియేటర్స్ లో సత్తా చాటింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.బాలయ్య బాబు మాస్ యాక్షన్ చూసి నందమూరి అభిమానులతో పాటు అశేష ప్రేక్షకలోకం పూనకాలెత్తిపోతున్నారు. భారీ రేంజ్ వసూళ్లు రాబడుతూ పలు రికార్డులు తిరగరాసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతోంది.ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ డాకు మహారాజ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ డీల్ జరిగినట్లు సమాచారం. అయితే ఈ వారంలోనే డాకు మహారాజ్ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తుండటం ఆసక్తికర అంశం. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డాకు మహారాజ్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుందట. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. బాలయ్య మార్క్ యాక్షన్, బాబీ డైరెక్షన్, తమన్ బీజీఎమ్ ఈ సినమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa