ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 14న విడుదల కానున్న ‘మదం’

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 04:18 PM

హర్ష గంగవరపు, లతా విశ్వనాథ్, ఇనయ సుల్తాన ప్రధాన పాత్రల్లో సూర్యదేవర రవీంద్రనాథ్ (చిన్న బాబు), రమేష్ బాబు కోయ నిర్మించిన చిత్రం ‘మదం’.  వంశీ కృష్ణ మల్లా  దర్శకత్వం వహించారు. మార్చి 14న ఈ సినిమా విడుదల కానుంది . సినిమా  టీజర్‌ను తండేల్  సినిమాతో పాటుగా థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.  టీజర్ కు వస్తున్న స్పందన గురించి చిత్ర బృందం స్పందించింది. డైరెక్టర్ వంశీకృష్ణ మల్లా మాట్లాడుతూ " నిర్మాత రమేష్ గారు ఇచ్చిన కథను చూసినప్పుడు నాకు చాలా భయమేసింది. ఇంతటి రా, రస్టిక్ సినిమా తెలుగులో రావడం అరుదు. తమిళం, మలయాళం భాషల్లో ఇలాంటి కంటెంట్ వస్తుంటుంది. ఇలాంటి క్లైమాక్స్‌ ఇప్పటి వరకు ఇండియన్ సినీ హిస్టరీలో రాలేదు. ఈ మూవీని చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి’ అని అన్నారు.    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa