కలీస్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటించిన 'బేబీ జాన్' చిత్రం డిసెంబర్ 25, 2024న విడుదల అయ్యింది. ఈ చిత్రం మిశ్రమ స్పందనను అందుకుంది. కీర్తి సురేష్ మరియు వామికా గబ్బి మహిళా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా కోలీవుడ్ నటుడు విజయ్ యొక్క థెరి కి అధికారిక రీమేక్. ఈ చిత్రం విడుదలైన 42 రోజుల తరువాత ఇప్పుడు రెంటల్ బేస్ పై అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. అయితే, తాజాగా ఇప్పుడు ఫిబ్రవరి 20 నుండి ఈ సినిమా అందరి ఉసెర్స్ కి ప్రసారానికి అందుబాటులో ఉంటుందని సమాచారం. ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంలో జాకీ ష్రాఫ్ నటించాడు. బేబీ జాన్‌ను ప్రియా అట్లీ, మురాద్ ఖేటాని మరియు జ్యోతి దేశ్‌పాండే ఆపిల్ స్టూడియోస్ మరియు సినీ 1 స్టూడియో నిర్మిస్తున్నారు. అట్లీ మరియు జియో స్టూడియోస్ సమర్పించిన ఈ సినిమాకి తమన్ స్వరపరిచిన సంగీతం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa