'ఫ్యామిలీస్టార్’ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించి, టీజర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ అనే శక్తిమంతమైన టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్ ఆధ్యంతం కళ్లు చెదిరే యాక్షన్ సీక్వెన్స్, అనిరుధ్ నేపథ్య సంగీతం, విజయ్ నటనతో సరికొత్త అనుభూతిని పంచింది. మే 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa