ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లిఫ్ట్ లో హీరోయిన్ రొమాన్స్..

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2019, 04:39 PM

లోకం మంచి కంటే చెడు వైపే ఎక్కువ ఆకర్షితులు అవుతారు అనడంలో సందేహం లేదు..మరీ ఈ కాలంలోనే అశ్లీలత విపరీతంగా పెరిగిపోతుంది. అది ఇంటర్నెట్ లో అయినా, లేక సినిమాలోనైనా..ఇక యువత కూడా ఎక్కువ వీటికే ఆకర్షితులు అవుతుండడంతో...దర్శక, నిర్మాతలు ఇలాంటి మూవీస్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కథ తక్కువైన పర్లేదు కానీ... నాలుగు లిప్ లాక్, ఒక బెడ్ రూమ్, బాత్ రూమ్ సీన్లతో సినిమా ముగించేస్తున్నారు. దాన్ని కాస్త హాట్ హాట్ గా టీజర్, ట్రైలర్ లో చూపించి, కొద్దిగా ప్రమోషన్స్ చేసుకొని సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగేలా చేస్తున్నారు. ఇక పెదువులు జుర్రుకోవడం, బెడ్ రూమ్, బాత్ రూమ్ లో రొమాన్స్ లాంటివి కామన్ అయ్యాయి. ఇలాంటి దారుమైన సీన్ల వల్ల యువత పెడదోవ పడుతున్నారని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నా..తీసే వారు చూసే వారు ఉన్నన్ని రోజులు అవేమి అడ్డంకి కాదని కొందరి వాదన.


 గత ఏడాది వచ్చిన 'గంధీ బాత్' వెబ్ సిరీస్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో ఎంత బూతు ఉండాలో అంత ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో దానికి సీజన్ 2 కూడా రూపొందించారు. హాట్ రొమాంటిక్ గా సాగే ఆ వెబ్ సిరీస్ కు తాజాగా మూడవ సీజన్ కూడా తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సీన్లు సెన్సార్ దాటి రావాలంటే కొన్ని కండీషన్స్ తో సినిమాను చేయాల్సి ఉంటుంది. అదే వెబ్ సిరీస్ లకు అలాంటివి ఏమీ ఉండవు. కనుక స్టార్స్ ఎంతో మంది వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు.మూడవ సీజన్ కు సంబంధించిన ఒక రొమాంటిక్ సీన్ ను లిఫ్ట్ లో చిత్రీకరించారు. అది కావాలని మేకర్స్ లీక్ చేశారో లేదంటే ఎలా బయటకు వచ్చిందో కాని అది యూట్యూబ్ లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో తెలుగు వారికి సుపరిచితురాలైన ఆశా షైనీ(ఫ్లోరా షైనీ) నటించింది. ఆమె ఇద్దరు అన్నదమ్ములతో పాటు ఒక లెస్బియన్ తో కూడా రొమాన్స్ చేసే సీన్స్ గంధీ బాత్ కు హైప్ ను తీసుకు వచ్చాయి. తాజాగా లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో కుమ్మేస్తుంది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa