విశ్వక్ సేన్ నటించిన అల్టెస్ట్ మూవీ 'లైలా'. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు విడులైంది. సోను మోడల్ (విశ్వక్ సేన్) హైదరాబాద్‌లో ఒక బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు. అతని మేకప్ స్కిల్స్‌కు ఆ ఏరియాలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇక మరోవైపు అతని జీవితంలో జెన్నీ (ఆకాంక్ష శర్మ) ప్రవేశిస్తుంది. ఆమెను చూసినప్పటి నుంచే సోను ప్రేమలో పడతాడు. అది అలా ఉండగా అనుకోని కారణంగా సోను అమ్మాయిగా మారాల్సిన పరిస్థితి ఎదుర్కొంటాడు. అసలు సోను ఎలాంటి పరిస్థితుల్లో లేడీ గెటప్ ఎత్తుకోవాల్సి వచ్చింది? అతను ఎదుర్కొన్న ప్రాబ్లమ్ ఏమిటి? చివరకు సోను దాన్ని ఎలా పరిష్కరించాడనేది మిగతా కథాంశం. విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో అదరగొట్టాడనే చెప్పోచ్చు.. ఆ గెటప్‌లో ఆయన నటన, బాడీ లాంగ్వేజ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కామెడీ సన్నివేశాలు, ముఖ్యంగా పెళ్లి సీక్వెన్స్, బాగున్నాయి. అభిమన్యు సింగ్ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేసింది.హీరోయిన్ ఆకాంక్ష శర్మ తన గ్లామర్, నటనతో ఆకట్టుకుంది. బబ్లూ పృథ్వీ రాజ్ విలన్ పాత్రలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇక మరోవైపు కథకు బలమైన స్క్రీన్‌ప్లే అందించడంలో దర్శకుడు రామ్ నారాయణ్ కొంత తడబడిన ఫీలింగ్ వచ్చింది.ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోదు. ముఖ్యంగా ప్రధాన పాత్రల మధ్య డ్రమాటిక్ ఎలిమెంట్స్ ప్రధానంగా లోపించాయి. అంతేకాదు లేడీ గెటప్‌లో వచ్చిన కొన్ని సీన్లు మరీ బ్యాడ్‌గా ఉన్నాయి. కథలో లాజిక్ అంతగా ఫాలో కాలేదు, కొన్ని చోట్ల సీన్లు సిల్లీగా ఉన్నాయి.
టెక్నికల్‌గా ఈ సినిమా బాగుంది. లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఎడిటర్ సాగర్ ఓకే. నిర్మాత సాహు గారపాటి నిర్మాణ విలువలు బాగున్నాయి. 'లైలా' సినిమాలో కొత్త కాన్సెప్ట్, లేడీ గెటప్‌తో వచ్చిన కొన్ని ఫన్ ఎలిమెంట్స్ ఓకే. కానీ సిల్లీగా ఉంటాయి. దీనికి తోడు బలమైన స్క్రీన్‌ప్లే, మెయిన్ క్యారెక్టర్ల డెవలప్‌మెంట్ లోపించడం వంటివి సినిమాను దెబ్బ తీశాయి. ఓవరాల్‌గా, ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు.
![]() |
![]() |