CCL 2025 లో భాగంగా తెలుగు వారియర్స్ - భోజ్‌పురి దబాంగ్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ రేపింది. విజయం ఇరు జట్లను ఊరించి దోబుచూలాడింది. సినీ, క్రీడా అభిమానులకు ఈ మ్యాచ్ మంచి మజాను అందించింది. టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలి ఓవర్‌లోనే ఆదర్శ్, సచిన్, అశ్విన్ బాబులు డకౌట్‌గా వెనుదిరిగారు. ఆ కాసేపటికే థమన్ కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో తెలుగు జట్టు కష్టాల్లో పడింది. దీంతో అఖిల్ , సాంబలు ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. వీరి పోరాటంతో తెలుగు వారియర్స్ తన తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. మనోజ్ తివారీ, మన్మోహన్‌లు తెలుగు జట్టు వెన్ను విరిచారు. ఏకంగా ఐదుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్ కాగా.. అఖిల్ 41, సాంబ 18, సామ్రాట్‌లు పోరాడారు. భోజ్‌పురి బౌలర్లలో మనోజ్ తివారీ , మన్మోహన్, ఆదిత్యలు తలా రెండేసి వికెట్లు, అజ్గర్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.
81 పరుగుల లక్ష్య చేధనకు దిన భోజ్ పురి 126 పరుగులు చేసి దుమ్ము లేపింది. కానీ రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం తెలుగు వారియర్స్ పికప్ అందుకుంది. దీంతో నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది తెలుగు వారియర్స్. అటు భోజ్ పురి రెండవ ఇన్నింగ్స్ లో 79 పరుగులకు కుప్పకూలింది. దీంతో తెలుగు వారియర్స్ బ్రాండ్ విక్టరీ కొట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa