ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయి వాయిస్ తో అబ్బాయిగా మారడానికి ఎందుకు ప్రయత్నిస్తాను?: స్నిగ్ధ

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2019, 02:16 PM

గాయనిగా .. నటిగా స్నిగ్ధకి మంచి పేరు వుంది. అయితే ఆమె హెయిర్ స్టైల్ .. వస్త్రధారణ అబ్బాయేమో అనుకునేలా చేస్తాయి. సినిమాల్లోను ఆమె ఇదే తరహా లుక్ తో కనిపిస్తుండటంతో, ఆమె అబ్బాయిగా మారిపోయిందనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఇదే విషయాన్ని గురించి స్పందించింది.


"భగవంతుడు నన్ను అమ్మాయిలా సృష్టించాడు .. మంచి వాయిస్ ఇచ్చాడు. గాయనిగా మంచి పేరు వస్తోంది. అమ్మాయి వాయిస్ తో అబ్బాయిగా మారడానికి ఎందుకు ప్రయత్నిస్తాను?. ఒకవేళ మారాలనుకున్నాగానీ అది అంత తేలికైన విషయమేమీ కాదుగా. మంత్రం వేసినట్టుగా జరిగే పని కాదు. నేను నాలాగే వుంటాను .. నేను అబ్బాయిగా మారానని అనుకుంటే అది వాళ్ల మూర్ఖత్వం. ఎవరో ఏదో అనుకుంటే నాకు పోయేదేమీ లేదు" అని చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa