బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి నిర్మాత సి. కల్యాణ్ ప్రయత్నిస్తున్నాడు.ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా .. గ్యాంగ్ స్టార్ గా ఆయన రెండు పాత్రలను చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికల అవసరం వుంటుందనే వార్తలు షికారు చేశాయి. ఒక కథానాయిక బోల్డ్ గా కనిపించాల్సి ఉండటంతో, పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించవలసి వుంది. ఈ సినిమాకి 'క్రాంతి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa