ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుక్ మై షోలో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' జోరు

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 04:04 PM

ఓహ్ మై కడవులే దర్శకుడు అశ్వత్ మారిముతుతో లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్రాగన్' ఫిబ్రవరి 21న తెలుగు మరియు తమిళంలో విడుదల అయ్యింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అనే టైటిల్ తో విడుదల అయ్యింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మరియు కయాదు లోహర్ మహిళా ప్రధాన పాత్రలలో నటించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ప్రముఖ టిక్కెట్ ప్లాట్‌ఫారమ్‌ బుక్ మై షోలో విడుదలైన తొలి రోజున 207K టికెట్స్ అమ్ముడయినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ప్రముఖ కోలీవుడ్ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు మైస్కిన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్ క్రింద నిర్మించబడుతుంది.  లియోన్ జేమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa