ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుస్తీ నేపథ్యంలో రామ్‌చరణ్‌ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 12:23 PM

రామ్‌చరణ్‌  దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో ఓ స్పోర్ట్స్‌ డ్రామా  సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్థి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్ళలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ కథానాయిక. శివ రాజ్‌కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా చరణ్‌ – దివ్యేందులపై క్రికెట్‌ నేపథ్య సన్నివేశాలు తెరకెక్కించారు. కాగా, తదుపరి షెడ్యూల్‌ మార్చి తొలివారం నుంచి ఢిల్లీలో మొదలు కానుందని సమాచారం. ఆ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కుస్తీ నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.కథ పరంగా ఈ సినిమాలో క్రికెట్‌, కుస్తీతోపాటు మరికొన్ని ఆటలకు ప్రాధాన్యముంది. చరణ్‌ దీంట్లో అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఓ కొత్త క్యారెక్టరైజేషన్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే పేరుతో పాటు మరో రెండు టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ టీజర్‌ విడుదలయ్యే అవకాశముంది. ఈ చిత్రానికి రెహమాన్‌ సంగీత దర్శకుడిగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa