ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్‌లో దాయాదుల పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌ను చూసేందుకు సినీ సెలబ్రిటీలు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలాకు ఓ అభిమాని స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. రెండురోజుల్లో ఆమె బర్త్‌డే కావడంతో కేక్ తీసుకొచ్చారు. ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగానే ఆమె కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa