ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందంతో అదరగొడుతున్న సీత

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2019, 12:46 PM

అందాల భామ కాజల్ అగర్వాల్ మోడ్రన్‌గానే కాదు చీరకట్టులో కూడా అదరగొట్టేస్తున్నది. తాజాగా సంప్రదాయంగా చీర కట్టుకొని ఫొటోషూట్‌లో పాల్గొన్నది. ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. అయితే ఈ ఫోటోషూట్‌ ఓ ఫ్యాషన్ కంపెనీకి సంబంధించినట్టు సమాచారం. కానీ బ్రాండ్ పేరు మాత్రం గోప్యంగా ఉంచడం గమనార్హం. ఇప్పటి వరకు మోడ్రన్, ఫ్యాన్సీ డ్రస్సెస్‌లో కనిపించిన కాజల్‌.. ఒక్కసారిగా చీరలో కనిపించి అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. చీరకట్టులో రాజసంగా కనిపించడమే కాకుండా మరింత అందంగా కనిపించింది. ఆమెను చీరకట్టులో చూసిన వారందరూ ఆమె అందం గురించి తెగ కామెంట్లు పెడుతున్నారు. 


ఇటీవల తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సీత చిత్రంలో కనిపించింది. అయితే బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఇక తమిళంలో రూపొందిన క్వీన్ రీమేక్ ప్యారిస్ ప్యారిస్‌ మూవీలోనూ, తమిళ చిత్రం కోమలిలోనూ నటించింది. ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్‌లోనే రిలీజ్ కానున్నది. ఈ రెండు సినిమాలపైనే ఆమె ఆశలు పెట్టుకొన్నది.అంతేకాకుండా హీరో మంచు విష్ణు నిర్మాతగా మారి రూపొందిస్తున్న హాలీవుడ్ సినిమాలో కూడా నటించే అవకాశం కొట్టేసింది. దీంతో దక్షిణాది, బాలీవుడ్ చిత్రాల తర్వాత ఆంగ్ల సినీ పరిశ్రమలో రాణించే ప్రయత్నం చేస్తున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa