ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'మనమే'

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 02:58 PM

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన మరియు శర్వానంద్, కృతి శెట్టి ప్రధాన పాత్రలో నటించిన 'మనమే' కి మంచి బాక్సాఫీస్ పనితీరు ఉన్నప్పటికీ ఈ చిత్రం దాని థియేట్రికల్ విడుదల తర్వాత దాదాపు ఎనిమిది నెలల పాటు OTT ఒప్పందం లేకుండా ఉంది. ఇటీవలే మేకర్స్ ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా OTT విడుదలను అధికారికంగా ధృవీకరించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా యొక్క స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈ చిత్రం మార్చి 7న డిజిటల్  ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో అయేషా ఖాన్, రాజ్ కందుకూరి, తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, తులసి, సచిన్ ఖేడేకర్  కీలక పాత్రలలో నటిస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు, హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతాన్ని స్వరపరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa