ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్విపాత్రాభినయంతో రానున్న సూర్య

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 10:54 AM

తమిళ స్టార్‌ సూర్య చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. రెట్రో, సూర్య 45, వాడివాసల్‌ చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. వీటిలో సూర్య వరుసగా ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్‌ నడుస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్రిష కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో సూర్య న్యాయవాదిగా, అయనార్‌గా రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అయనార్‌ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతున్నట్లు కోలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఇది ఆధ్యాత్మిక అంశాలతో నిండిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇక ఈ సినిమా తర్వాత సూర్య చేయనున్న ‘వాడివాసల్‌’లోనూ.. ఆయన తండ్రీ-కొడుకుగా ద్విపాత్రాభినయంతో అలరించనున్నట్లు తెలుస్తోంది. దీనికి వెట్రిమారన్‌ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. గతేడాది కంగువా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు . శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పరాజయాన్ని చవిచూసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa