పెళ్లి తర్వాత ఓ రెండు సినిమాల్లో మెరిసిన కత్రినాకైఫ్ ప్రస్తుతానికి నటనకు బ్రేక్ తీసుకుంది..భక్తిమార్గంలో ఉన్నట్టుంది. ఆ మధ్య కుంభమేళాలో పాల్గొన్న కత్రినా త్రివేణి సంగమంలో స్నానమాచరించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టింది. లేటెస్ట్ గా కర్ణాటకలో కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించింది. కుటుంబంతో సహా సర్ప సంస్కార పూజలో పాల్గొంది. ఆలయంలో పూజలు నిర్వహించేటప్పుడు ముసుగు వేసుకుంది..ఫేస్ ని కవర్ చేసేసింది.సాధారణంగా కుక్కే ఆలయంలో నాగ దోషానికి సంభందించిన పూజలు చేయిస్తారు. పెళ్లి, పిల్లలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోవాలని ప్రార్థిస్తారు.'ఛావా'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విక్కీ కౌశల్ ని 2021లో పెళ్లిచేసుకుంది కత్రినా కైఫ్. ప్రస్తుతం పిల్లల కోసం సుబ్రహ్మణ్యస్వామి పూజలు చేసుకుంటోందని టాక్
![]() |
![]() |