ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'మహారాజా'

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 02:50 PM

విజయ్ సేతుపతి నటించిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ 'మహారాజా' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదలైన మొదటి విభాగంలో మహారాజా 100 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్క్రీన్ ప్లేకి ప్రశంసలు అందుకుంది. ఇటీవలే చైనాలో విడుదలైన మహారాజా, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం చైనా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జెమిన్ టీవీ ఛానల్ లో మార్చి 16న మధ్యాహం 12 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజన్ సుబ్రమణ్యం, అభిరామి గోపీకుమార్ మరియు దివ్యభారతి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ది రూట్, థింక్ స్టూడియోస్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్లపై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com