సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు మార్చి 26 వరకు రిమాండ్ విధించింది. బుధవారం పోసాని కృష్ణ మురళిని పోలీసులు గుంటూరులోని జడ్జి ఎదుట హాజరుపర్చారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోసానిని గుంటూరు జిల్లా సబ్ జైలుకు తరలించారు. బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుట వాపోయిన సంగతి తెలిసిందే.
![]() |
![]() |