నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాకు ప్రదీప్ అద్వైతం దర్శకుడు. ఇప్పటికే విడుదలైన చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. రోషన్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో ఫుట్ బాల్ ఆటగాడిగా రోషన్‌ను పరిచయం చేశారు. బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా, ధైర్యంగా నిలబడడం ఆకట్టుకుంది. మైదానంలోనే కాదు జీవితంలో కూడా నిజమైన ఛాంపియన్‌గా ఎదగడానికి చేసే పోరాటంగా ఈ చిత్రం ఉండబోతోంది. మిక్కీ జే మేయర్ అందించిన నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలిచింది. తోట తరణి కళా దర్శకత్వం ఈ చిత్రం గొప్పతనాన్ని మరింత పెంచుతుంది. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
![]() |
![]() |