నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న కొత్త సినిమా రాబిన్‌హుడ్. చలో, భీష్మ లాంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నుంచి వస్తున్న ప్రమోషనల్ స్టఫ్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది.ముఖ్యంగా ఇటీవలే విడుదలైన కేతిక శర్మ ఐటెం సాంగ్‌తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై విమర్శలు ఉన్నా, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.ఇదిలా ఉండగా, ఫిలింనగర్ వర్గాల్లో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోందిఅదేంటంటే, ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ నాన్- థియేట్రికల్ బిజినెస్ సాధించినట్టుగా సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 సంస్థ కొనుగోలు చేయగా, శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది. నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ రేటుకు ఈ హక్కులు అమ్ముడైనట్టు తెలుస్తోంది.
ఇవి కేవలం తెలుగు హక్కులే కాగా, ఇంకా హిందీ డబ్బింగ్ హక్కులు సహా ఇతర భాషల హక్కులు నిర్మాత దగ్గరే ఉన్నాయని తెలుస్తోంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే, ఆ హక్కులను కూడా Zee5 మంచి రేటుకు కొనుగోలు చేసే అవకాశముందని, లేదంటే ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఆసక్తి కనబర్చే అవకాశం ఉందని అంటున్నారు.
![]() |
![]() |