బహుముఖ నటుడు విక్రమ్ తదుపరి చిత్రం 'వీర ధీర శూరన్' లో కనిపించనున్నాడు. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో దుషారా విజయన్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క జ్యుక్ బాక్స్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. దీనికి చిత్త ఫేమ్ SU అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వీర ధీర శూరన్ పార్ట్ 2 షూటింగ్ పూర్తయింది, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హెచ్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు వీర ధీర శూరన్‌ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో SJ సూర్య, సిద్ధిక్ మరియు సూరజ్ వెంజరమూడుకీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో SJ సూర్య ప్రతినాయకుడిగా, పోలీసుగా నటించారు. చిత్ర సాంకేతిక బృందంలో జి.వి.ప్రకాష్ సంగీతం, తేని ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్, ప్రసన్న జికె ఎడిటర్, సిఎస్ బాలచందర్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. వీర ధీర శూరన్ మార్చి 27న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa