‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్... టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ గా చెప్పుకొంటారు. తాజాగా వీరి ఇద్దరుముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం విదితమే. నాన్న ప్రేమ అని ఈ సినిమాకి టైటిల్ పెట్టినట్టు సోషల్ మీడియాలో వినిపించినా చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. ఐతే మూవీలో రావు రమేష్ ని ఓ ప్రత్యేక పాత్రకోసం ఎంపిక చేసినా ఇప్పుడు ఆ సినిమా నుంచి రమేష్ బైటపడ్డాడని, ఆయన నటించడం లేదని వార్తలు వస్తున్నాయి.
సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో రావు రమేష్ కి ఓ ప్రత్యేకమైన పాత్ర ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ రమేష్ ని ఈ సినిమాలో తీసుకున్నా, ఇప్పుడు ఆయన ప్లేస్ లో నటుడు, దర్శకుడు అమృతం ఫేమ్ హర్షవర్ధన్ కి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది కేవలం డేట్స్ సమస్య కారణంగానే రమేష్ తప్పుకున్నట్టు చిత్ర యూనిట్ నుంచి వినవస్తోంది,