తిరుమల శ్రీవారిని హీరో నితిన్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. తాను నటించిన ‘రాబిన్ హుడ్’ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ క్రమంలో మూవీ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో నితిన్‌కు అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa