శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఇటీవలి హై-బడ్జెట్ పొలిటికల్ డ్రామా 'గేమ్ ఛేంజర్' బాక్స్ఆఫీస్ వద్ద ప్రభావం చూపడంలో విఫలమైంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన రామ్ నందన్ మరియు అప్పన్న గా నటించారు. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ సినిమాలు ఛానల్ లో త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. కియారా అద్వానీ కథానాయికగా నటించగా, ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, జయరాం కీలక పాత్రలలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa