ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చినట్లు స్వయంగా తానే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మనాలీలో ఉన్న తన ఇంట్లో కొన్ని రోజులుగా ఉండటం లేదని, దీంతో ఆ బిల్లు చూసి షాకయ్యా అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఇలాంటి పరిస్థితులు సిగ్గుచేటని అన్నారు. 'నా సోదరీ సోదరులను నేను కోరేది ఒక్కటే. ఇలాంటి సమస్యలపై మనమంతా పోరాడాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ఈ తోడేళ్ల చెర నుంచి కాపాడాలి’ అని ఆమె చెప్పుకొచ్చారు.కంగనా విషయానికి వస్తే.. ఈమె చివరగా నటించిన చిత్రం ఎమర్జెన్సీ. ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించడంతో పాటు తొలిసారి దర్శకురాలి అవతారమెత్తింది. అంతేకాక తన సినిమాను తనే నిర్మించింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa