ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ కల్యాణ్, జ్యోతి కృష్ణ కాంబోలో ‘హరిహ‌ర వీర‌మ‌ల్లు’ మే 09న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 11, 2025, 03:33 PM

పవన్‌ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ ‘హరిహ‌ర వీర‌మ‌ల్లు’పై కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్న‌ట్లు మేక‌ర్స్ 'ఎక్స్'  వేదిక‌గా ప్ర‌క‌టించారు. రీరికార్డింగ్‌, డ‌బ్బింగ్‌, వీఎఫ్ఎక్స్ ప‌నులు జెట్ స్పీడ్‌తో కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. ఈ వేస‌విలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు బిగ్గెస్ట్ సినిమాటిక్ అద్భుతాన్ని తీసుకొస్తున్నామ‌ని పేర్కొన్నారు. మే 9న పెద్ద స్క్రీన్లపై వీర‌మ‌ల్లు ఆగ‌మ‌నం అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ సినిమాను మే 09న‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక‌ పిరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొద‌టి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ త‌దిత‌రులు ఇత‌ర‌ కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa