సాయి పల్లవి నటనకు ఫిదా కాని వారు ఉండరు. తాజాగా ఈ నేచురల్ బ్యూటీపై మిల్కీ బ్యూటీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఓదెల 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న తమన్నా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో యాంకర్ "మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు?" అని తమన్నాని ప్రశ్నించగా.. ఐ లవ్ సాయిపల్లవి అని చెప్పారు. 'యాక్టింగ్, డ్యాన్స్ ఆల్‌రౌండర్.. యూనిక్ పర్సనాలిటీ' అని తెగ పొగిడేసింది తమన్నా.తమన్నా నటిస్తున్న తాజా చిత్రం ఓదెల – 2 ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సంపత్ నంది, డి. మధు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa